kntv
kntv

శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో మృతదేహం

3 weeks ago

సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలోని దావదగుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపింది. చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.