kntv
kntv

మహారాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ సునీల్ శుక్రే

1 month ago

బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సునీల్ బాలకృష్ణ శుక్రే మహారాష్ట్ర లోకాయుక్త సంస్థ నూతన ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని లోక్‌ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండే, సునేత్ర పవార్, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ హాజరయ్యారు.