kntv
kntv

ఉరవకొండలో ఉద్రిక్తత.. సాగునీటి కోసం రైతుల ఆందోళన

2 hours ago

 

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సాగునీటి కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి అనంతపురం-బళ్లారి హైవేపై బైఠాయించారు. హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ కాలువల ద్వారా వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.