kntv
kntv

ఎన్నికల వేళ పోలీసుల నిఘామూడు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్

1 hour ago

సీతారామపురం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఉదయగిరి సీఐ అంకమ్మరావు ఆధ్వర్యంలో సోమవారం బసినేనిపల్లి, సింగారెడ్డిపల్లి గ్రామాలతో పాటు సీతారామపురంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.