kntv
kntv

గిరిజన ప్రాంతాలకు 2 వేల ఇందిరమ్మ ఇళ్ల డిమాండ్

2 months ago

గిరిజన ప్రాంత శాసనసభ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఆదివాసీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మంత్రి సీతక్క నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. పోడు భూములకు పట్టాలు, ఇందిర గిరి జల వికాసం అమలు, ఐటీడీఏల బలోపేతం, ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.