విశాఖపట్టణం డిసెంబర్ 1 : విశాఖపట్టణం పర్యాటక అందాలకు కొత్త మెరుగు వచ్చింది. కైలాసగిరిపై నిర్మించిన స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి సోమవారం ఘనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పర్యాటకులు, విజువల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ వంతెన అధికారికంగా ప్రారంభం కావడంతో విశాఖలో పర్యాటక హంగులు మరింత పెరిగాయి.
దేశంలోనే అతి పొడవైన స్కైవాక్ — కేరళ రికార్డు బ్రేక్
120 మీటర్ల పొడవుతో ఈ స్కైవాక్ బ్రిడ్జి దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్గా నిలిచింది. ఇప్పటి వరకు కేరళలోని 40 మీటర్ల గ్లాస్ బ్రిడ్జికి ఉన్న రికార్డును ఇది అధిగమించినట్లు అధికారులు ప్రకటించారు. సముద్రతీర నగరం విశాఖపట్టణం అందాలను పర్వతశ్రేణుల ఎత్తు నుంచి ఆస్వాదించే వీలును కలిగించే విధంగా ఈ బ్రిడ్జిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పర్యాటకులు నిలబడి అడుగుల క్రింద కనిపించే పారదర్శక గ్లాస్ ఫ్లోర్ విజువల్‌గా అద్భుత అనుభూతిని కలిగించనుంది.
పర్యాటక ఆకర్షణకు కొత్త హబ్
కైలాసగిరి ఇప్పటికే రోప్‌వే, వ్యూ పాయింట్లు, జోయ్ ರೈడ్స్‌తో పర్యాటకుల ప్రియతమ గమ్యస్థలం. ఇప్పుడు స్కైవాక్ అందుబాటులోకి రావడంతో ఇది విశాఖలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో అగ్రస్థానానికి చేరింది. అధికారులు పేర్కొన్న ప్రకారం, సీసీటీవీ సెక్యూరిటీ, నాన్-స్లిప్ గ్లాస్, రాత్రివేళ ప్రత్యేక లైటింగ్
వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.