kntv
kntv

అవయవ దానం గొప్ప కానుక: పీవీ సింధు

2 months ago

విశాఖపట్నంలో అవయవ దాన దినోత్సవ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ P. V. Sindhu పాల్గొన్నారు. అవయవ దానంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. అవయవ దానం ఎంతోమందికి రెండో జీవితాన్ని ఇస్తుందని, ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. కుటుంబాలు తీసుకునే ఈ నిర్ణయం అమూల్యమైన మానవతా సేవ అని అన్నారు.