kntv
kntv

తెలంగాణ HoFFగా వినయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు

1 month ago

తెలంగాణ అటవీ శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (HoFF) డా. సి. సువర్ణను సేవల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వినయ్ కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనే HoFFగా కొనసాగనున్నారు.