kntv
kntv

పులివెందుల: కదలని మురుగు నీరు పట్టించుకోని అధికారులు

36 minutes ago

పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు నందు ఉన్న జయమ్మ కాలనీ వద్ద మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ నీళ్లలో వెళ్లాలంటేనే దుర్వాసన భరించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు.