kntv
kntv

అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం...

3 weeks ago

కంచికచర్ల వైసీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జునరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల గ్రామంలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ పార్టీని ‘గొడ్డలి పార్టీ’గా వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. ఘటనతో సంబంధంలేని 13 మందితో పాటు తనపై కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు.