kntv
kntv

తెలంగాణలో జనసేన "జనవాణి" కార్యక్రమం ప్రారంభం

3 hours ago

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నేటి నుంచి "జనవాణి" కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఫిర్యాదులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. మణికొండలోని పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనవాణి నిర్వహించనున్నారు.