kntv
kntv

యాదగిరిగుట్ట పాలక మండలికి సీఎం దిశానిర్దేశం

1 hour ago

యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పారదర్శక నిర్వహణపై చర్చించారు. క్షేత్ర వైభవాన్ని మరింత పెంచేలా పనిచేయాలని, భక్తులకు నాణ్యమైన సేవలు అందించాలని సీఎం పాలక మండలికి దిశానిర్దేశం చేశారు.