kntv
kntv

కియా సైరోస్ ఈవీ లాంచ్.. 526 కి.మీ రేంజ్‌తో ఆకర్షణ

1 hour ago

కియా ఇండియా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సైరోస్ ఈవీని రూ.13.50 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. 42kWh, 51.4kWh బ్యాటరీ ఆప్షన్లతో వచ్చిన ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 526 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, మహీంద్రా ఈవీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.