kntv
kntv

రాష్ట్రపతి భవన్‌లో జపాన్ ప్రధానికి ఘన స్వాగతం!

1 hour ago

భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయే తకైచికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఘనమైన అధికారిక స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనతో భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది.