kntv
kntv

సజ్జలగూడెం దారిలో కల్వర్టు మరమ్మతులు

1 hour ago

చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారి, కల్వర్టు తెగిపోవడంతో సజ్జలగూడెం మార్లబండ ఆంజనేయస్వామి గుడికి, పొలాలకు వెళ్లే భక్తులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
​ఈ సమస్యపై స్పందించిన మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి తమ సొంత నిధులతో సోమవారం జేసీబీతో మరమ్మతులు చేయించారు. వంకలోని మురుగునీరు, కంపచెట్లను తొలగించి, మట్టితో రహదారిని పునరుద్ధరించారు. దీంతో రైతులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలిమి బసవరాజు, గోపాల్, వెంకటేష్, రాముడు తదితరులు పాల్గొన్నారు.