kntv
kntv

రైల్వే ప్రాజెక్ట్ భూ నిర్వాసిత రైతులతో సమావేశం....

1 month ago

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ అంశంపై తహసీల్దార్ నరసింహారావు రైల్వే భూ నిర్వాసిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూములు కోల్పోతున్న రైతులు తమ సందేహాలు, సమస్యలు, డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.