kntv
kntv

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి.. అప్రమత్తమైన అధికారులు

2 months ago

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువకు 9.30 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. నదీతీరాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.