kntv
kntv

పెంబర్తిలో ఉద్రిక్తత.. కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత

3 hours ago

జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. కన్నెపల్లి వెళ్తున్న కే.టి. రామారావు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్, "లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటే, పంటలు ఎండిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు" అని ఆరోపించారు.