kntv
kntv

సైదాబాద్ స్కూల్ ఘటనపై జనసేన ప్రశ్నలు.. విచారణకు డిమాండ్

1 hour ago

హైదరాబాద్ సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు మతపరమైన అంశాలను హోంవర్క్‌గా ఇచ్చారనే ఆరోపణలపై జనసేన స్పందించింది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. పాఠశాలలు మత ప్రచార కేంద్రాలుగా కాకుండా రాజ్యాంగ విలువలు, దేశభక్తి, విజ్ఞానాన్ని బోధించే విద్యాలయాలుగా ఉండాలని పేర్కొంది.