kntv
kntv

ఎస్.కొటాల పాఠశాల గదులను తక్షణమే నిర్మించాలి: AISF

1 hour ago

కోసిగి మండల పరిధిలోని ఎస్.కొటాల గ్రామ ప్రభుత్వ పాఠశాల సమస్యలపై సోమవారం ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా AISF జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.ఈరేష్, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.. గత ఏడాది వర్షాలకు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
​వేసవి సెలవుల్లో కొత్త గదులు నిర్మిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు పనులు ప్రారంభించకుండా గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం చర్చిలో తాత్కాలికంగా పాఠాలు చెబుతున్న పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  వెంటనే స్పందించి, నిధులు మంజూరు చేసి పాఠశాల గదుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు హనుమంతు, ప్రవీణ్, జీవన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.