ఏపీ నవంబర్ 25 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామ సచివాలయాల నిర్మాణం, పని తీరు, ఉద్యోగుల పదోన్నతులపై సమగ్రమైన అధ్యయనం చేపట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ప్రతి శాఖ ఎలా నిర్మాణాత్మకంగా ఉన్నది, వాటిని గ్రామ సచివాలయాలతో ఎలా అనుసంధానించాలి, సిబ్బందికి ఏ విధమైన బాధ్యతలు అప్పగించాలి వంటి అంశాలపై లోతైన పరిశీలన అవసరం ఉందని ఆయన తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం అనివార్యమైనదే కానీ, ఆ ప్రక్రియలో సచివాలయ వ్యవస్థ పనితీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ, వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయి అధ్యయన నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడం, సిబ్బంది సమస్యలను పరిష్కరించడం, శాఖల మధ్య సమన్వయ లోపాలను తొలగించడం కోసం అవసరమైతే ప్రతి నెలా ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సమావేశంలో మున్సిపల్, వ్యవసాయ, పశు సంవర్ధక, హోం, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ, విద్యుత్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రులతో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, ఆర్థిక తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొని గ్రామ సచివాలయాల భవిష్యత్ దిశను నిర్ణయించేందుకు ముఖ్యమైన సూచనలు అందించారు.
Click here to
Read More
Are you sure?
You want to delete this comment..!
Remove
Cancel