జగ్గయ్యపేట తొలి ఉదయం : పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొనిఎ స్ ఎస్ పి ఎం బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం నక్కా బాబూరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వార మాట్లాడుతూ అమెరికా కెనడా ఐర్లాండ్ వంటి అనేక దేశాల పాలనా వ్యవస్థలను అధ్యయనం చేసి రూపొందించిన భారత రాజ్యాంగం చాలా ఆదర్శప్రాయమని ఎస్ ఎస్ పి ఎం బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం నక్కా బాబూరావు అన్నారు. బుధవారం నాడు స్థానిక స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా హెచ్ఎం బాబురావు మాట్లాడుతూ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులపాటు అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని వివరించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు లగడపాటి శ్రీదేవి రాజ్యాంగం ఏర్పాటు గురించి మాట్లాడిన విధానం ఉపాధ్యాయులను, విద్యార్థులను ఆకట్టుకుంది. వ్యాయామ ఉపాధ్యాయులు వేగినటి వెంకటరమణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముక్కా సత్యనారాయణ, రాఘవరావు, నల్లూరి పద్మ ,పాకలపాటి ఉష, త్రివేణి ,స్వాతి శిల్ప, ప్రమీల ,స్వర్ణలత, వాణి తదితరులు పాల్గొన్నారు. ఉదయం పూట మొత్తం తరగతి గదుల్లోని ఐఎఫ్పి ప్యానల్స్ లో రాజధాని లో జరుగుతున్న మాక్ అసెంబ్లీని పిల్లలకు చూపించారు.