kntv
kntv

ముద్రగడ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

2 months ago

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ లోక్‌సభ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.